: ములాయంకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ములాయం సింగ్ ఈరోజు 75వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ములాయంకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ‘ములాయంజీ, మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాన్ని, దీర్ఘాయుస్సును ప్రసాదించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.