: కాశ్మీర్లో మోదీ ర్యాలీకి భారీ భద్రత
జమ్మూ, కాశ్మీర్ లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ నేడు కిష్ట్వర్ పట్టణానికి రానుండటంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సైన్యం సహాయంతో పలు అంచెల భద్రతను ఆయనకు కల్పించనున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సభాస్థలికి వచ్చిపోయే మార్గాలన్నిటి వద్దా సెక్యూరిటీ గార్డులను నియమించినట్టు ఆయన తెలిపారు. ఆయన ప్రసంగించనున్న స్టేడియంను భద్రతాదళాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి.