: ప్రతి అమ్మాయికి సల్మాన్ లాంటి అన్నయ్య ఉండాలి: అజయ్ దేవగణ్
సోదరి అర్పితాఖాన్ వివాహాన్ని ఆమె ఇష్టానికి అనుగుణంగా, ఎంతో బాధ్యతతో ఘనంగా జరిపిన సల్మాన్ ఖాన్ ను నటుడు అజయ్ దేవగణ్ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రతి అమ్మాయికి సల్మాన్ వంటి సోదరుడు ఉండాలని ఆకాంక్షించాడు. "కొత్తగా పెళ్లయిన అర్పితా, ఆయుష్ ల జంటను విష్ చేసేందుకు వెళుతున్నాను. ప్రతి అమ్మాయికి సల్మాన్ వంటి అన్నయ్య ఉండాలి" అంటూ అజయ్ ట్వీట్ చేశాడు. ముంబయిలోని బాంద్రాలో నిన్న (శుక్రవారం) జరిగిన వివాహ రిసెప్షన్ కు హాజరయ్యే ముందు ఇలా తన అభిప్రాయాన్ని తెలిపాడు.