: ఓబులేష్ ను కోర్టుకు తీసుకెళ్ళిన పోలీసులు


కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన ఓబులేష్ ను ఈరోజు ఉదయం పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్ళారు. గట్టి బందోబస్తు మధ్య తలకు ముసుగేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. మధ్యాహ్నంలోగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి మరింత విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కర్నూలులోని ఒక లాడ్జిలో గురువారం నాడు ఓబులేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News