: ఏపీలో జూనియర్ వైద్యుల సమ్మె ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ వైద్యులు ఈ ఉదయం నుంచి సమ్మెకు దిగారు. రాష్ట్రంలో బోధనాసుపత్రుల వద్ద జూడాలు సమ్మె చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేశారు. దాంతో, ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జూడాల సమ్మెపై ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ, జూనియర్ వైద్యులు సమ్మె బాట పట్టడం సరికాదన్నారు. హైకోర్టు ఉత్తర్వులు అందిన తరువాత సీఎంతో చర్చిస్తామని చెప్పారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News