: ఒంగోలు డిపాజిటర్ల నెత్తిన 'లిజార్డ్' శఠగోపం...రూ.5 కోట్లతో పరారీ!
అతి తక్కువ కాలంలో అత్యధిక రాబడులిస్తామని మాయమాటలు చెప్పి, అమాయక జనం నుంచి డబ్బులు దండుకుని బోర్డు తిప్పేసిన కంపెనీల జాబితాలో లిజార్డ్ కూడా చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన లిజార్డ్, పెద్ద ఎత్తున ప్రచారం చేసి అనతికాలంలోనే రూ.5 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. తన టార్గెట్ డిపాజిట్లు రాగానే బోర్డు తిప్పేసింది. లిజార్డ్ మోసానికి గురైన వేలాది మంది బాధితులు శనివారం సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.