: వసతిగృహం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని షెడ్యూల్ కులాల బాలికల వసతిగృహం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారని అధికారులు తెలిపారు. హాస్టల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.