: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 29 వరకు పొడిగింపు
తెలంగాణ శాసనసభ సమావేశాలను మరో ఆరు రోజుల పాటు పొడిగించారు. ఈ నెల 29 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రెండు పూటలా సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, నాలుగు రోజుల పాటు పద్దులపై చర్చ జరపనున్నారు. వచ్చే శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ జరుగుతుంది. చివరి రోజున స్వల్ప కాల చర్చలు మాత్రమే జరుగుతాయి. కాగా, సభలో టీడీపీ నేత రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ బీఏసీలో కోరారు. అంగీకరించని మంత్రి హరీశ్ రావు, రేవంత్ క్షమాపణ చెప్పే వరకు తమ సభ్యులు మాట్లాడనివ్వరని స్పష్టం చేశారు. వాస్తవానికి రేపటితో సమావేశాలు ముగియాల్సి ఉంది.