: 400 మంది మిలిటెంట్లకు క్షమాభిక్ష


మేఘాలయాలో పలు నేరాలకు పాల్పడ్డ 400 మందికిపైగా ఏఎన్వీసీ (అచిక్ నేషనల్ వాలంటీర్ కౌన్సిల్), ఎఎన్వీసీ-బి సంస్థలకు చెందిన మిలిటెంట్లకు క్షమాభిక్ష లభించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా నేడు వెల్లడించారు. ఈ మేరకు మేఘాలయా ప్రభుత్వం, కేంద్రం, ఏఎన్వీసీ నేతల మధ్య జరిగిన చర్చల అనంతరం, సాధారణ నేరాలపై కేసులను ఎత్తివేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. కఠిన శిక్షలు పడే అవకాశమున్న కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏఎన్వీసీ నుంచి విడిపోయి మరో గ్రూప్ గా ఏర్పడ్డ ఏఎన్వీసీ-బి ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని గారో పర్వత ప్రాంతాల్లో వీరి ప్రాబల్యం అధికంగా ఉంది. వీరిపై హత్య, అపహరణ వంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఏఎన్వీసీలో 250 మంది, ఏఎన్వీసీ-బిలో 300 మంది మిలిటెంట్లు సభ్యులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News