: అక్రమ వలసవాదుల క్రమబద్ధీకరణకు ఒబామా ఓకే!
అమెరికాకు అక్రమ మార్గాల్లో వలస వచ్చిన వారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన విదేశీయుల సేవలను వినియోగించుకునే విషయంలో ఈ తరహా చర్యలు దేశానికి మరింత మేలు చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై గురువారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అమెరికా వలసవాద చట్టాల్లో తాజా మార్పుల వల్ల భారత్, చైనా నుంచే కాక వివిధ దేశాల నుంచి సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన దాదాపు 50 లక్షల మందికి ఊరట లభించనుంది. ప్రసంగంలో తన వ్యతిరేకుల వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన ఒబామా, వారి అభ్యంతరాలను కూడా నివృత్తి చేశారు. అమెరికా చట్టసభలో రిపబ్లికన్ల మెజారిటీ పెరిగిన నేపథ్యంలో వలసవాద చట్టాల సవరణ ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాననుకున్న మేరకు వలసవాద చట్టాల సవరణకు ఒబామా మరింత ధైర్యంగా ముందడుగేశారు.