: 610 జీవో ఎన్టీఆర్ పుణ్యమేనని కేసీఆరే అన్నారు: ఎర్రబెల్లి
తెలంగాణలో 610 జీవో... దివంగత నందమూరి తారక రామారావు కారణంగానే వచ్చిందని సభలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఈ విషయాన్ని గతంలో కేసీఆరే చెప్పారని ఆయన తెలిపారు. శంషాబాద్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును ప్రకటిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జరిగిన చర్చ సందర్భంగా ఎర్రబెల్లి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక్క 610 జీవోనే కాక తెలంగాణకు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్టీఆర్ చూపిన శ్రద్ధ ఏ ముఖ్యమంత్రి చూపలేదని ఆయన అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనగా, బీజేపీ సభ్యుడు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించడంతో సభ సద్దుమణిగింది.