: టీడీపీ నుంచి నన్ను గెంటేసేందుకు కొన్ని దుష్టశక్తులు యత్నించాయి: కేశినేని నాని
విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. తనను పార్టీ నుంచి గెంటి వేసేందుకు కొన్ని దుష్టశక్తులు యత్నించాయని, మొన్నటి ఎన్నికల్లోనూ తనకు టికెట్ రాకుండా చేసేందుకు ఆ శక్తులు శాయశక్తులా ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి సన్మానం కోసం ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి నాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఆ దుష్ట శక్తులు ఎవరన్న విషయంపై నాని స్పష్టత ఇవ్వలేదు. దీంతో నాని పేర్కొన్న దుష్ట శక్తులు ఎవరన్న విషయంపై ప్రస్తుతం పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది.