: నేడు విశాఖ జిల్లా నేతలతో జగన్ భేటీ
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ జిల్లా పార్టీ నేతలతో భేటీ కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, నేతల వలసలు, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలు, నేతల వలసలను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై జగన్ ఈ సందర్భంగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కొణతాల రామకృష్ణ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేతో పాటు ఓ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి కూడా రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. దీంతో నేటి భేటీపై ఆ పార్టీకి చెందిన జిల్లా శ్రేణులు ఆసక్తి కనబరుస్తున్నాయి.