: రజనీకాంత్ కి క్షమాపణ చెప్పిన కేంద్ర మంత్రి


కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు క్షమాపణ చెప్పారు. గోవాలో జరుగుతున్న 45వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి... కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల పేర్లు చదివారు. అందులో రజనీకాంత్ పేరు చదవలేదు. ఇంతలో జరిగిన తప్పు గుర్తించిన ఆయన క్షమించాలని కోరుతూ, తాను రెండు కాగితాలపై పేర్లు రాసుకున్నానని, కానీ ఒకపేపర్ పైనున్న పేర్లు మాత్రమే చదివానని అన్నారు. చలన చిత్రోత్సవాల్లో రజనీకాంత్ కు సెంటినరీ అవార్డును ప్రకటించారు. రజనీకాంత్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి అందజేశారు.

  • Loading...

More Telugu News