: ఆర్టికల్ 370పై విస్తృత చర్చ జరగాలి: రాజ్ నాథ్ సింగ్
జమ్మూ కాశ్మీర్ లో అమలవుతున్న ఆర్టికల్ 370పై విస్తృత చర్చ జరగాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 370 కారణంగా జమ్మూ కాశ్మీర్ లో పథకాల అమలుకు ఆటంకంగా ఉందని అన్నారు. పథకాలు అమలు కాని కారణంగా జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.