: భర్త చనిపోయినట్టు ధ్రువపత్రాలు అడగడం సరికాదు: జీవన్ రెడ్డి
వితంతువులను భర్త చనిపోయినట్టు ధ్రువపత్రాలు అడగడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, మళ్లీ పెళ్లి చేసుకోని వితంతువులను ఏటా ధ్రువపత్రం అడగటం భావ్యం కాదని అన్నారు. డబుల్ బెడ్ రూంలు కట్టిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి, ఇప్పుడు మూడు గదుల ఇల్లు కావాలంటే వారికి పింఛను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆయన మండిపడ్డారు.