: రేపు ఢిల్లీకి బాబు... ఫుల్ బిజీ షెడ్యూల్


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు నదుల అనుసంధానంపై కేంద్ర మంత్రి ఉమాభారతితో సమీక్ష నిర్వహించనున్నారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో బాబు చర్చించనున్నారు. అనంతరం టెలికాం పెండింగ్ అంశాలపై రవిశంకర్ ప్రసాద్ తో చర్చించేందుకు బాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఏపీలోని కారిడార్లకు రహదారులపై చర్చించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News