: ఓ మెట్టు దిగుతాం...విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం: గంటా
విద్యార్థుల భవిష్యత్ కోసం ఓ మెట్టు దిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఓ మెట్టు దిగి ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సహకరించుకుంటాయని అన్నారు. ఇంకా కావాలంటే తెలంగాణ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో కూడా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇరు రాష్ట్రాల విద్యాశాఖల మంత్రుల సమావేశం రద్దయింది.