: గోదావరి పుష్కర ఏర్పాట్లపై రేపు మంత్రివర్గ భేటీ
వచ్చే సంవత్సరం జరగనున్న గోదావరి నది పుష్కర ఏర్పాట్ల గురించి చర్చించేందుకు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సమావేశం కానుంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. పుష్కర ఘాట్లలో ఏర్పాట్లు, స్నాన ఘట్టాలు, రహదార్లు, నదీ తీరంలో పరిశుభ్రత, ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, రైళ్ళ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రుల బృందం చర్చించనుంది.