: మామను చంపి కట్టుకథ అల్లిన అల్లుడు


స్నేహితునితో కలసి సొంత మామను కాల్చి చంపడమే కాకుండా శత్రువులు దాడి చేశారని కట్టుకథ అల్లాడు. ఆపై పోలీసుల విచారణలో దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... తన మామ షకీర్ అలీ, స్నేహితుడు అనీస్ లతో కలసి షాపింగ్ ముగించుకొని ఘజియాబాద్ నుంచి వస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు బైక్ లపై వచ్చి కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో షకీర్ అలీని ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోపే మరణించాడని ఈ నెల 15న కమీల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు పలు అనుమానాలు వచ్చాయి. స్నేహితులు ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం, సంఘటనా స్థలంలో బైక్ టైరు గుర్తులు లేకపోవటంతో తమదైన శైలిలో ఎంక్వయిరీ చేసి నిజం రాబట్టారు. ఆస్తి కోసం ఈ హత్యకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని అదనపు డిప్యూటీ కమీషనర్ రాజేంద్ర సింగ్ సాగర్ తెలిపారు.

  • Loading...

More Telugu News