: బయటకు వెళితే చంపేస్తామన్నారు: బాబా రాంపాల్ భక్తులు


తమను బలవంతంగా ఆశ్రమం లోపల కూర్చోబెట్టారని, బయటకు వెళ్ళాలని చూస్తే కాల్చి చంపేస్తామని రాంపాల్ అనుచరులు బెదిరించారని వివాదాస్పద ఆధ్యాత్మిక గురు బాబా రాంపాల్ ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన భక్తులు వాపోయారు. బర్వాలాలోని ఆయన ఆశ్రమంలో చాలా మంది ఉన్నారని వివరించారు. నాలుగు రోజులుగా తాము నరకం అనుభవించామని పేర్కొన్నారు. కాగా, లోపల ఉన్నవారంతా ఎటువంటి భయం లేకుండా బయటకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బాబా రాంపాల్ ప్రైవేటు సైన్యం ఆయుధాలతో ఆశ్రమంలో ఉండటంతో వారిని వెలుపలకు రప్పించేందుకు పారా మిలటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. బయటకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారని భక్తులతో రాంపాల్ అనుచరులు చెబుతున్నట్టు మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ తెలిపింది.

  • Loading...

More Telugu News