: అధికారంలోకొస్తే కాశ్మీర్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్
ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గురువారం ఆయన కాశ్మీర్ లో పర్యటించారు.1989లో 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన ఈ వ్యవస్థ దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతోంది. అయితే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం అమలుకు నోచుకోలేదు. తద్వారా మిగతా రాష్ట్రాల మాదిరిగా కాశ్మీర్ లోని గ్రామాలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు అందడం లేదు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాజ్ నాథ్ సింగ్, తాము అధికారంలోకి వస్తే, పల్లె సీమలను నిధుల కొరత బారి నుంచి బయటపడేసే పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసి తీరుతామని చెప్పారు.