: తాజ్ మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించండి: యూపీ మంత్రి


చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను ఉత్తర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలని ఆ రాష్ట్ర మంత్రి అజం ఖాన్ డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటికే పలు అంశాలపై ఆ రాష్ట్రం, కేంద్రం మధ్య కొనసాగుతున్న వివాదాల్లో తాజ్ మహల్ చేరనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో అజం ఖాన్ ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తాజ్ మహల్ లో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలకు అనుమతివ్వాలని లక్నో ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగిమహ్లీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ముందు ప్రతిపాదించారు. మౌలానా, అఖిలేశ్ కు అత్యంత సన్నిహితుడని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్య నేతల ప్రతిపాదనను యూపీ సీఎం పెడచెవిన పెట్టే అవకాశాలే లేవన్నది విశ్లేషకుల వాదన. ఇదే జరిగితే, కేంద్రంతో మరో అంశంపై పోరుకు యూపీ సిద్ధమైనట్లే!

  • Loading...

More Telugu News