: పదవీ విరమణ వయసు పెంచం: తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ప్రస్తక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల కోసం యువకులు ఎదురు చూస్తున్నారని, కావున 58 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, రాష్ట్రం సాధించుకున్న తరువాత ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత ఆశతో ఉందని, త్వరలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు.