: కేబీఆర్ పార్క్ కాల్పుల మిస్టరీని ఛేదించిన పోలీసులు... నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్


హైదరాబాద్ నడిబొడ్డున, వీఐపీలు సంచరించే ప్రాంతంలో అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై ఏకే47తో కాల్పులకు తెగబడ్డ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అంబర్ పేట సీపీఎల్ ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ ఈ కాల్పులు జరిపాడని పోలీసులు నిర్ధారించారు. అనంతపురంలో ఓబులేష్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాదుకు తరలించారు. ఈ కాల్పుల్లో ఓబులేష్ తో పాటు మరో ముగ్గురు దుండగులు కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం, ఓబులేష్ ను ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు... నిందితులను ఒక్క రోజు కూడా గడవక ముందే పట్టుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News