: జానారెడ్డి బుద్ధిమంతుడు: కేసీఆర్ కితాబు


అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డిని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నారు. శాసనసభలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మానేసి, సలహాలు ఇచ్చుకోవడం మంచిదని జానారెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన కేసీఆర్... జానారెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, గత చరిత్రలు తవ్వుకుంటూ పోతే ఏమీ రాదని అన్నారు. జానారెడ్డి బుద్ధిమంతుడు అని కితాబిచ్చారు. మరో సందర్భంలో, ఎస్ఎల్ బీసీ పనుల విషయంలో ప్రభుత్వాన్ని నత్త నడక అనలేదని... పనులు నత్తనడక అని మాత్రమే అన్నానని జానా చెప్పారు. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ, 'జానా నత్త కాదు, నేను నత్త కాదు... ఆ పనులే అంత' అంటూ ఛలోక్తి విసిరారు.

  • Loading...

More Telugu News