: సమ్మిట్ ముగిసింది... సరదాకు తెరదీశారు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జి-20 దేశాల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారీ సమావేశానికి. ఈ సదస్సు ముగియడంతో ఆయా దేశాధినేతలంతా సిటీలోని ఓ పబ్ బాటపట్టారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, చైనా అధ్యక్షుడు ఝీ జిన్ పింగ్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు బారును పావనం చేశారు. ఒబామా వైన్ పుచ్చుకోగా, మెర్కెల్ బీరు తాగారట. ఇలా ఎవరికి నచ్చింది వారు పుచ్చుకుని రీచార్జ్ అయ్యారట.