: ఆర్జేడీ అధికారంలోకి వస్తే దళితులను ఆలయ పూజారులుగా నియమిస్తాం: లాలూ
జార్ఖండ్ లో తమ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే, దళితులను ఆలయాల్లో పూజారులుగా నియమిస్తామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ ఛత్రా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జనార్ధన్ పాశ్వాన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. "ఆలయాల్లోకి దళితులను అనుమతించకూడదని పూరి శంకరాచార్య ఇటీవల అన్నారు. ఒకవేళ మా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే, దళితులు, వెనకబడిన వర్గాల వారు అవే ఆలయాల్లో పూజారులు అవుతారు" అని పేర్కొన్నారు.