: దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం పింఛన్లు ఇస్తోంది: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లపై ప్రకటన చేశారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం పింఛన్లు ఇస్తోందన్నారు. అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పింఛన్లకు సంబంధించి 39 లక్షల 63 వేల దరఖాస్తులు వచ్చాయని సభకు వివరించారు. 24 లక్షల 21 వేల మందిని అర్హులుగా గుర్తించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. వీటి పంపిణీకి రూ.3350 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. ఇక, హైదరాబాదులో కలకలం రేపిన 'అరబిందో' నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నారు. గురువారం శాంతిభద్రతలపై చర్చకు ఓకే చెప్పారు.