: జూడాల సమ్మె చట్ట విరుద్ధమే: హైకోర్టు
జూనియర్ వైద్యుల సమ్మె చట్ట విరుద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో 50 రోజులకు పైగా జరుగుతున్న జూడాల సమ్మెపై బుధవారం ఉదయం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ప్రజారోగ్య సేవలకు ఇబ్బంది కలిగిస్తున్న జూడాల సమ్మెను అదుపు చేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ సేవల అంశం మినహా మిగిలిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించి, జూడాలు సమ్మెను విరమించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. 48 గంటల్లోగా జూడాలతో సమ్మెను విరమింపజేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది.