: శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం - నాగార్జున సాగర్కు వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 856 అడుగులకు చేరింది. జలాశయం ఎడమ విద్యుత్ కేంద్రంలో 4 జనరేటర్ల ద్వారా 580 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఔట్ఫ్లోలో 30,365 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. కాగా శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ నీటిమట్టం సైతం పెరుగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 572.70 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫ్లో 13వేల క్యూసెక్కులు ఉన్నట్టు వెల్లడించారు.