: పక్కా ఇళ్ల కోసం ఆకాశవాణి టవర్ ఎక్కిన వ్యక్తి


తక్షణమే పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం హైదరాబాదులోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆకాశవాణి కేంద్రం టవర్ ను ఎక్కి ఓ వ్యక్తి నిరసన తెలుపుతున్నాడు. భీంరావ్ బస్తీకి చెందిన కొమరయ్య అనే వ్యక్తి ఈ తెల్లవారుజామున టవర్ ఎక్కాడు. బస్తీలో తక్షణమే పక్కా ఇళ్లు నిర్మించాలని కొమరయ్య డిమాండ్ చేస్తున్నాడు. పక్కా ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే టవర్ దిగుతానంటూ చెబుతున్నాడు. అతనిని టవర్ పైనుంచి కిందకు దించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News