: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఎనిమిదో గేమ్ డ్రా
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఎనిమిదో గేమ్ డ్రాగా ముగిసింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్, మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఎనిమిదో గేమ్ డ్రా అయ్యింది. దీంతో ప్రస్తుతానికి ఆధిక్యంలో కొనసాగుతున్న కార్ల్ సన్, ఎనిమిదో గేమ్ తర్వాత కూడా ఆధిక్యంతోనే దూసుకెళుతున్నాడు. మొత్తం 12 గేముల్లో విజేత ఎవరన్న విషయం తేలనుంది. కార్ల్ సన్ కంటే కాస్త వెనుకబడ్డ ఆనంద్ తిరిగి పుంజుకునేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి.