: కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి: పొన్నాల


వరంగల్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొన్న అనంతరం పొన్నాల మీడియాతో మాట్లాడారు. దొంగతనం చేయడం ఎంత నేరమో, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కూడా అంతే నేరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఇప్పటికే గవర్నర్ ను కోరామని చెప్పారు. అంతేకాకుండా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News