: భన్వర్ లాల్ ను కలసిన ముగ్గురు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అశ్వారావుపేట, పినపాకకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ను కలిశారు. తమ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు ఏపీలోకి వెళ్లాయని, 2019 వరకు ఆ మండలాల సమస్యలు ఏపీ దృష్టికి తీసుకువెళ్లేలా చూడాలని కోరారు. అటు ఏపీ అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరారు.