: ఈ సూపర్ సైకిల్ ముందు ఫెరారీ కారు దిగదుడుపే!
ఫెరారీ కార్లు ప్రపంచంలోనే పేరెన్నికగన్నవి. వేగంగా వెళ్లడంలో వీటికివే సాటి. ఫార్ములా వన్ రేసుల్లో ఫెరారీ కార్లు ఎన్నోసార్లు సత్తా చాటాయి. సెకన్లలోనే వందల మైళ్ల వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. అలాంటిది, ఫెరారీ కారును ఓ సైకిల్ వెనక్కినెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. వివరాల్లోకి వెళితే... స్విట్టర్జాండ్ కు చెందిన ఆర్నాల్డ్ నెరాషెర్ ఓ సైకిల్ ను రూపొందించాడు. దాని ప్రత్యేకత ఏంటంటే, దానికి ఇంజిన్ ఉంటుంది. రాకెట్ ఛోదకశక్తితో కూడిన ఆ ఇంజిన్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్, కంప్రెస్డ్ ఎయిర్ సమ్మేళనాన్ని ఇంధనంగా ఉపయోగించారు. నవంబర్ 7న ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించారు. దక్షిణ ఫ్రాన్స్ లోని పాల్ రికార్డ్ రేసింగ్ ట్రాక్ అందుకు వేదికగా నిలిచింది. కేవలం 4.8 సెకన్లలోనే 331 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుని అబ్బురపరిచింది ఈ సూపర్ సైకిల్. ఫెరారీ ఎఫ్430 స్కుడేరియా కారు వేగం కంటే ఇది అధికం. ఈ సైకిల్ కు, కారుకు మధ్య రేసు నిర్వహించగా... ఫెరారీని ఆమడదూరంలో పెట్టి ఈ సైకిల్ గమ్యస్థానాన్ని చేరుకోవడం విశేషం. నెరాషర్ మిత్రుడు ఫ్రాంకోయిస్ గిస్సీ ఈ సైకిల్ పై రేసులో పాల్గొన్నాడు.