: వెంగ్ సర్కార్ కు 'సీకే నాయుడు' పురస్కారం
టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ కు బీసీసీఐ 'కల్నల్ సి.కె. నాయుడు' జీవితకాల సాఫల్యతా ట్రోఫీని ప్రకటించింది. అటు యువ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కు ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురస్కారం ప్రకటించింది. బీసీసీఐ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 21న ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.