: అందరికీ అందుబాటులోకి సత్యసాయి నివాసం


పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నివసించిన యజుర్వేద మందిరాన్ని ఇకమీదట భక్తులందరూ సందర్శించవచ్చు. బాబా నివాసాన్ని అందరూ సందర్శించేందుకు వీలుగా మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ రాజు వెల్లడించారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 23 నుంచి ఈ మందిరాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలోని 118 గ్రామాలకు రక్షిత మంచినీటి పథకం పూర్తి చేశామని, 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రత్నాకర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News