: బీహార్లో అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ ను కాల్చి చంపిన దుండగులు
బీహార్లోని వైశాలి జిల్లాలో పాత గండక్ బ్రిడ్జి వద్ద ఓ అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ ను దుండగులు కాల్చి చంపారు. కార్తీక పౌర్ణమి నుంచి ఇక్కడ జరిగే మలేగావు మేళాలో విధులు నిర్వహించేందుకు వచ్చిన రామ్ అశోక్ రాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు వివరించారు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక మరియు అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అశోక్ రాయ్ ని డిప్యుటేషన్ పై మేళాలో అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ గా నియమించినట్టు తెలిపారు.