: విజయవాడలో రియల్ మాఫియా ఆగడం...ఎన్నారై కిడ్నాప్!


నవ్యాంధ్ర రాజధానికి కేంద్రం కానున్న విజయవాడలో రియల్ మాఫియా శరవేగంగా విస్తరిస్తోంది. కొత్త రాజధాని పరిసరాల్లోని భూములను చేజిక్కించుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిన రియల్ మాఫియా అప్పుడే తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. గన్నవరం పరిసరాల్లో వంద ఎకరాల భూములున్న ఎన్నారై రాజాబాబును సోమవారం సాయంత్రం అపహరించింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు మంగళవారం ఉదయం దాకా కూడా రాజాబాబు ఆచూకీకి సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. గన్నవరం భూమిని విక్రయించాలన్న తమ మాట విననందుకే రాజాబాబును రియల్ మాఫియా కిడ్నాప్ చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం సాయంత్రం కారులో వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఎన్నారైను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News