: భార్యకు విడాకులిచ్చాడు... ఎందుకో తెలుసా?
సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయన్నది సామాజికవేత్తల మాట. ఈ క్రమంలో, సోషల్ మీడియా ఓ కాపురం విచ్చిన్నం కావడానికి ఎలా కారణమైందో చూడండి! సౌదీ అరేబియాలో ఓ వ్యక్తి తన భార్యకు 'వాట్సాప్' ద్వారా మెసేజ్ లు పంపాడు. అయితే, అతడి భార్య ఆ సందేశాలకు రిప్లయ్ ఇవ్వలేదట. తాను మెసేజ్ పంపితే బదులివ్వకపోవడాన్ని అతడు అవమానకరంగా భావించి వెంటనే భార్యను వివరణ అడిగాడు. ఆ సమయంలో తాను ఫోన్ లో మాట్లాడుతున్నానని ఆమె సమాధానమిచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గంటల తరబడి చాటింగ్ చేస్తోందని, తన మెసేజ్ లు చదివి కూడా రిప్లయ్ ఇవ్వడంలేదన్నది అతని వాదన. చాటింగ్ చేస్తూ తనను పట్టించుకోవడంలేదని వాపోయాడు. ఇప్పుడు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.