: బాబా రాందేవ్ కు 'జెడ్' కేటగిరీ రక్షణ
వివాదాస్పద యోగా గురువు బాబా రాందేవ్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్' కేటగిరీ రక్షణ కల్పించింది. ఈ క్రమంలో 22 మంది సాయుధ గార్డులు ఆయనకు రక్షణగా వుంటారు. ఒక ఎస్కార్ట్ కారు ఎప్పుడూ ఆయన వెంటే ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి మద్దతుగా రాందేవ్ విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2012 ఆగస్టులో అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రాందేవ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.