: 2జీ స్కాం కేసులో రాజా, కనిమొళిలపై నేటి నుంచి విచారణ
2జీ కేటాయింపుల్లో జరిగిన కుంభకోణంపై కోర్టు విచారణ నేటి నుంచి ప్రారంభం అవుతోంది. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్, కుమార్తె, ఎంపి కనిమొళిలపై సాక్ష్యుల వాంగ్మూలాన్ని కోర్టు నేటి నుంచి రికార్డు చేస్తుంది. మొత్తం 16 మందిని సీబీఐ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. నేరం రుజువైతే వీరికి గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష పడనుంది.