: కాశ్మీర్ సీఎమ్ ఇంటిముందు కాల్పులు


నిత్యం ఉద్రిక్తతలు తలెత్తుతుండే కాశ్మీర్లో అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే ప్రాంతమది. ప్రజా ప్రతినిధుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకు నివసించే ప్రాంతమది. అట్లాంటి చోట, అందునా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటి ముందు సోమవారం ఉదయం తుపాకీ తూటాల శబ్దం కలకలం రేపింది. తొలుత మిలిటెంట్ల దాడి అనుకున్నారు. అయితే, ఒమర్ ఇంటి ముందు డ్యూటీ చేస్తున్న సైనికుడే గన్ పేల్చాడని తర్వాత తేలింది. వెంటనే మిగతా జవాన్లు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పులు జరిపిన జవాను మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు ఉన్నాడని పోలీసులు తెలిపారు. 'నా భద్రతపై ఎటువంటి సందేహాలు లేవు. నా సెక్యూరిటీ టీంపై పూర్తి నమ్మకం ఉంది' అని ఘటన అనంతరం ఒమర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News