: ధ్యాంక్యూ సో మచ్ : ఫోన్ లో సచిన్ కు చంద్రబాబు అభినందన


క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్ కు ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగను రాజ్యసభ సభ్యుడి హోదాలో సచిన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఈ గ్రామాన్ని సచిన్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నారు. ఆదివారం కండ్రిగకు వచ్చిన సచిన్ రూ.2.79 కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశారు. రెండు గంటల పాటు గ్రామంలో సుడిగాలి పర్యటన జరిపిన సచిన్ ఆ తర్వాత చెన్నై మీదుగా ముంబై వెళ్లిపోయారు. సచిన్ పర్యటన విషయాన్ని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ద్వారా తెలుసుకున్న చంద్రబాబు నేరుగా సచిన్ కు ఫోన్ చేశారు. కండ్రిగను దత్తత తీసుకున్నందుకు సచిన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎన్నో గ్రామాలుండగా, తన రాష్ట్రంలోని గ్రామాన్ని ఎంచుకున్న సచిన్ కు బాబు ‘ధ్యాంక్స్’ చెప్పారు. చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి తనను పొగడ్తలతో కీర్తించడంతో సచిన్ కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారట.

  • Loading...

More Telugu News