: న్యూజిలాండ్ లో భూకంపం
సోమవారం తెల్లవారుఝామున న్యూజిలాండ్ లో భూకంపం సంభవించింది. గిస్బోన్ కు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.7 గా నమోదైందని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్టు తమకు ఎటువంటి సమాచారం అందలేదని వివరించారు.