: శ్రీకాంత్ సూపర్ షో... చైనా ఓపెన్ పురుషుల టైటిల్ కూడా మనదే
చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల టైటిల్ కూడా భారత్ ఖాతాలోకే చేరింది. ఆదివారం జరిగిన పురుషుల విభాగం టైటిల్ పోరులో భారత ఆశాకిరణం కిదాంబి శ్రీకాంత్ రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ ను 21-19, 21-17తో వరుస గేముల్లో మట్టికరిపించాడు. అటు, మహిళల టైటిల్ ను సైనా నెహ్వాల్ నెగ్గిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.