: టాస్ గెలిచిన శ్రీలంక... వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా
ఐదు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు వన్డేల్లో పరాజయం పాలైన లంకేయులు రాంచీలో జరిగే ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియాకు పోటీనివ్వలేకపోవడం లంక వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. తొలి మూడు వన్డేల్లో టాస్ నెగ్గిన శ్రీలంక జట్టు పిచ్ పరిస్థితిని సద్వినియోగం చేసుకోలేక వరుస ఓటములు చవిచూసింది. మరోవైపు, భారత్ ఈ సిరీస్ ను 5-0తో ముగించేందుకు తహతహలాడుతోంది. అప్రాధాన్య మ్యాచే అయినా, ఉదాసీనతకు తావివ్వరాదని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.