: అభివృద్ధి చేయడం నా వంతు...నిలబెట్టుకోవడం మీ వంతు: కండ్రిగ వాసులతో సచిన్
గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం తన వంతు అని, దానిని నిలబెట్టుకోవడం మీ వంతని రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగ వాసులకు సూచించారు. ఆదివారం సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న కండ్రిగలో సచిన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన అభివృద్ధి కార్యక్రమాలు తొలి ఇన్నింగ్స్ అయితే, దానిని గ్రామస్థులు నిలబెట్టుకోవడాన్ని రెండో ఇన్నింగ్స్ గా సచిన్ అభివర్ణించారు.