: ‘అక్రమ’ బంధం పోలీసులపై అభియోగాల నమోదు
హైదరాబాదులో వివాహేతర సంబంధం నెరపుతూ పట్టుబడ్డ పోలీసు అధికారులపై శనివారం సాయంత్రం అభియోగాలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి, వరంగల్ జిల్లా మహిళా ఎస్ఐ లను నగరంలోని బృందావనం హోటల్లో రాసలీలల్లో ఉండగా ఎస్ఐ భర్త ఫిర్యాదుతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. స్వామిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించిన పోలీసులు మహిళా ఎస్ఐపై అభియోగాలు నమోదు చేశారు. శనివారం ఉదయం కలకలం రేపిన ఈ ఉదంతంపై సాక్షాత్తు డీజీపీ కలుగజేసుకోవడంతో పోలీసులు వేగంగా స్పందించారు.